వరికోలులో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
24-10-2026 | 10:24pm
కోహెడ, అక్టోబర్ 24(విజయక్రాంతి): మండలంలోని వరికోలు గ్రామంలో(Varikolu Village) కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ సుదగోని దేవరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మల జయరాజు చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్న యన్నారు. పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో కళ్యాణ లక్ష్మి పథకం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.