ఈ నెల 15న మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

13-10-2026 | 07:13pm

నేరేడుచర్ల (విజయక్రాంతి): నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ కొనతం వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం నేరేడుచర్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(Minister Uttam Kumar Reddy) సహకారంతో నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఐదో పాలకవర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

చైర్‌పర్సన్‌గా చలసాని స్పందన రాజీవ్, వైస్‌చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డితో పాటు వీరితో పాటు 12 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. నూతన పాలకవర్గం రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించేలా కృషి చేయడం, మార్కెట్ కమిటీ అభివృద్ధికి చర్యలు చేపట్టడంపై దృష్టి సారించాలన్నారు. ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేరేడుచర్ల పాలకీడు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ నూకల సందీప్ రెడ్డి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు