గర్భంలో శిశువు మృతి ఘటనపై స్పందన
- వైద్యురాలు, సిబ్బంది నిర్లక్ష్యం లేదు...
- సిబ్బందికి సమాచారం ఇవ్వకుండానే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన గర్భిణీ...
- అమావాస్య తర్వాత డెలివరీ కోసం వస్తానని గర్భిణీ తెలిపింది...
- బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ వెల్లడి...
బాన్సువాడ, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో(Banswada Government Hospital) గర్భిణీకి సంబంధించిన ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్పందించారు. వైద్యురాలు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందలేదని ఆయన వెల్లడించారు.
గర్భిణీ ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వకుండానే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపారు. అమావాస్య తర్వాత డెలివరీ కోసం వస్తానని ఆమె చెప్పినట్లు సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితుల ఆరోపణలు, ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
ఘటనకు సంబంధించి వైద్య రికార్డులు, చికిత్స వివరాలు పరిశీలించి సమగ్ర విచారణ జరిపితేనే శిశువు మృతికి దారితీసిన కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.