సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలి
- బీజేపీ నాయకుల ఆందోళన
ఎల్బీనగర్, అక్టోబర్ 13: హస్తినాపురం డివిజన్ గ్రీన్ ల్యాండ్ కాలనీలో ఐదు నెలల క్రితం ప్రారంభించిన సీసీ రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిరసనగా మంగళవారం బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఎరుకల మల్లేశ్ గౌడ్(BJP Division President Mallesh Goud) మాట్లాడుతూ... హస్తినాపురం డివిజన్ లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, అనేక ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ సైతం సక్రమంగా జరగడం లేదని మండిపడ్డారు.
గ్రీన్‌ల్యాండ్ కాలనీలో రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గౌని వెంకటేశ్ గౌడ్, కంది శ్రీనివాస్ రెడ్డి, బూరం ప్రకాశ్, మల్లేశ్ యాదవ్, లక్ష్మీకాంత్ రెడ్డి, మొగుతాల వెంకటేశ్ గౌడ్, పాపిరెడ్డి, బాలాజీ కామిని, మమత, ఏలే బుచ్చయ్య, కాసం ధనంజయ, భిక్షపతి శెట్టి, రామేశ్వర్, అశోక్, రంజిత్ గౌడ్, లక్ష్మణ్, అశోక్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.