లింగోజిగూడలో వైభవంగా బతుకమ్మ సంబరాలు

13-10-2026 | 08:44pm

 - ఆటపాటలతో అలరించిన గాయని మంగ్లీ

ఎల్బీనగర్: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో బతుకమ్మ సంబురాలు వాడవాడలా వైభవంగా నిర్వహిస్తున్నారు. లింగోజిగూడ డివిజన్‌లోని క్రాంతి క్లబ్ మైదానంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(MLA Devireddy Sudheer Reddy) ఆధ్వర్యంలో ముద్దపప్పు బతుకమ్మ సంబురాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని పండుగ సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించారు. ప్రముఖ గాయని మంగ్లీ(Singer Mangli) తన బృందంతో కలిసి పాటలు, ఆటపాటలతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకల్లో జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ కమలా సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు