కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో అన్నపూర్ణగా దుర్గామాత దర్శనం
13-10-2026 | 09:03pm
ఎల్బీనగర్, అక్టోబర్ 13: కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం(Karmanghat Hanuman Temple)లో దేవీ నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నారు. శరన్నవ రాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం నాలుగో రోజు ఆలయంలోని సరస్వతీ అమ్మవారు అన్నపూర్ణదేవీ అలంకారణలో భక్తులకు దర్శనమిచ్చారు. సరస్వతీ మాత ఆలయంతోపాటు ప్రధాన దేవాలయం శ్రీ ధ్యానాంజనేయ స్వామి ప్రాంగణాన్ని పండ్లు, ఫలాలు, పూలతో అందంగా అలంకరించి అలంకరించారు. కాగా, అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకం, చండి హోమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి లావణ్య, భక్తులు పాల్గొన్నారు.