కోదాడ నయానగర్ 14వ వార్డులో కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు
భారీగా హాజరైన భక్తులు
కోదాడ అక్టోబర్ 13(విజయ క్రాంతి): పట్టణంలోని 14వ వార్డు నయానగర్ ఏరియాలో దేవీ నవరాత్రి ఉత్సవాలు(Devi Navaratri Celebrations) కొనసాగుతున్నాయి. మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో దాతల సహకారంతో ప్రతి రోజు అన్నదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొన్నారు. నవరాత్రి వేడుకలతో పండుగ వాతావరణం నెలకొన్నది. చిన్నారులు, మహిళలు, యువత భారీగా ఎత్తున పూజల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, 14వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.