పాక్‌పై భారత్ సంచలన విజయం

18-11-2026 | 06:57am

ఢాకా: దాయాది దేశాల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో భారత్ అదరగొట్టింది. పాకిస్థాన్‌పై 2-1 తేడాతో విజయం సాధించి SAFF Championship టైటిల్‌ను మరోసారి సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో భారత్ తన ఖాతాలో 10వ SAFF టైటిల్‌ను జమ చేసుకోవడమే కాకుండా, వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచి అరుదైన ఘనత సాధించింది. Second-String Teamతో బరిలోకి దిగినా భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు.

ఫైనల్ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసే సమయంలో పాకిస్థాన్‌కు అలంగీర్ ఘాజీ (45+1వ నిమిషం) గోల్ అందించాడు. దీంతో భారత్‌పై పాక్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే రెండో అర్ధభాగంలో టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకున్నారు. 59వ నిమిషంలో పాకిస్థాన్ ఆటగాడు రెడ్ కార్డ్‌తో మైదానం వీడటంతో ఆ జట్టు 10 మందికే పరిమితమైంది. ఈ అవకాశాన్ని భారత్ చక్కగా ఉపయోగించుకుంది. 60వ నిమిషంలో సుహైల్ అహ్మద్ భట్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు. మ్యాచ్ ముగింపునకు కొద్దిసేపటి ముందు 88వ నిమిషంలో సందీప్ మండీ మరో గోల్ కొట్టి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. చివరి వరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకున్న టీమిండియా 2-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. దీంతో పాకిస్థాన్‌కు నిరాశ తప్పలేదు. పదోసారి SAFF కిరీటాన్ని అందుకున్న భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

మరిన్ని వార్తలు