మా భూమిని మేమే విక్రయించాం.. ఆధారాలుంటే చూపించండి

13-10-2026 | 07:56pm

జమ్లా తాండ భూమి విక్రయంపై ఆరోపణల్లో వాస్తవం లేదు

సిర్గాపూర్ అక్టోబర్ 13(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని జమ్లా తాండలో(Jamla Thanda) భూమి విక్రయానికి సంబంధించి సోషల్ మీడియాలో(Social Media), మీడియాల్లో సోమవారం వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని భూమి విక్రయించినట్లు పేర్కొంటున్న సంబంధిత వ్యక్తులు మంగళవారం నాడు తెలిపారు.

జమ్లా తాండ పరిధిలోని సర్వే నంబర్లు 199, 220, 221, 233లో ఉన్న మొత్తం 21 ఎకరాల భూమి అబ్దుల్ రషీద్ తండ్రి జానిమియా కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అన్నదమ్ముల పేర్లపై ఉందని వివరించారు. తమ అవసరాల నిమిత్తం సుశీల, రమేష్ చవాన్‌తో పాటు వారికి సన్నిహితులైన మరో ఏడుగురికి భూమిని తామే విక్రయించినట్లు భూమి యజమానులు తెలిపారు.

ఈ భూమి విక్రయంపై తాండకు చెందిన తుకారం, సర్పంచ్, విశ్వనాథ్, మరీ కొందరు సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు, ఆరోపణల్లో వాస్తవం లేదని ఖండించారు. భూమిని తామే స్వయంగా విక్రయించామని, దీనికి సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉంటే చూపించాలని వారు పేర్కొన్నారు. భూమి విక్రయానికి సంబంధించి తమ వద్ద ఉన్న వివరాలు, ఆధారాల ప్రకారం తాము సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు