మద్యం మత్తులో ఆటో నడిపి కారును ఢీకొట్టిన డ్రైవర్‌పై కేసు
మేడిపల్లి, అక్టోబర్ 13 (విజయక్రాంతి); మద్యం మత్తులో ఆటోను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి కారును ఢీకొట్టిన ఘటనలో ఆటో డ్రైవర్‌పై మేడిపల్లి పోలీసులు(Medipally Police) కేసు నమోదు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల11న సాయంత్రం ఎల్బీనగర్ నుంచి ఉప్పల్, స్వరూప్ నగర్ లోని ఇంటికి వెళుతున్న పొగుల అజయ్ రెడ్డి, రిషి స్కూల్ సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద కారు నడుపుతూ సిగ్నల్ కోసం వేచి ఉండగా, ఆటో డ్రైవర్ ఎస్. రాము మద్యం మత్తులో ఆటోతో కారును ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో కారు హెడ్లైట్, బంపర్ దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు క్రైమ్ నంబర్ 1451/2026 కింద ఆటో డ్రైవర్ ఎస్. రాము, యజమాని కె. భీమ్ రాజ్‌లపై కేసు నమోదు చేసుకొని, ఆటోను సీజ్ చేసి, ఆటోలో ఉన్న ఆర్. కృష్ణ మద్యం మత్తులో ఫిర్యాదుదారుడితో దురుసుగా ప్రవర్తించడంతో అతనిపై పెట్టీ కేసు నమోదు చేశామని మేడిపల్లి పోలీసులు తెలిపారు.