ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్ అమలుకు థానా అంగీకారం

13-10-2026 | 10:15pm

హనుమకొండ, (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలో గుర్తించిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు చేసేందుకు థానా కమిటీ సభ్యులు అంగీకరించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సమక్షంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని, గుర్తించిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్(Employees Health Scheme) పథకాన్ని అమలు చేసేందుకు సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యాలు సహకరించాలని సూచించారు. ఈ పథకం ద్వారా అర్హులైన ఉద్యోగులు మెరుగైన వైద్య సేవలు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో గుర్తించిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్ పథకం అమలుకు థానా కమిటీ సభ్యులు అంగీకరించడం సంతోషకరమని తెలిపారు. పథకం అమలుకు సంబంధించి అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ఉద్యోగులకు వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో థానా కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాకేష్, ప్రదాన కార్యదర్శి డాక్టర్ రమేష్,సభ్యులు డాక్టర్ విజయ్‌ చందర్ రెడ్డి, డాక్టర్ విజయ్, డాక్టర్ బి మోహన్ రావు, డాక్టర్ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు