అధికారి తీరుపై అసహనం

25-09-2026 | 10:47pm

ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత

బిజినేపల్లి : విద్యుత్తు శాఖలో(Electricity Department) ఒక అధికారి తీరు, వ్యవహార శైలిపై స్థానిక ప్రజల్లో అసహనం ఏర్పడి ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారి తీస్తుంది. గ్రామాల్లో విద్యుత్తు సమస్యలు ప్రమాదాలపై కింది స్థాయి అధికారులు, సిబ్బంది చేసే సూచనలు, సలహాలు చూద్దాంలే, చేద్దాంలే వంటి మాటలతోనే సరిపెడుతున్నారని ఆ శాఖలోని సిబ్బందే ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ అధికారి తీరుపై గత కొన్ని నెలలుగా పలు ఆరోపణలతో సామాజిక మాంద్యమాల్లో(Social media platforms) వార్తలు వైరల్(Viral News) అవుతున్నాయి. అధికారి వ్యవహారశైలిపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంటే ప్రతిపక్షాలు కూడా చూస్తూ గమ్మున్న ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు