కానిస్టేబుల్ విధులకు ఆటంకం

25-09-2026 | 10:27pm

హన్వాడ, (మహబూబ్ నగర్ జిల్లా)సెప్టెంబర్ 25: విజయక్రాంతి : మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో(Kothapeta Village) వినాయక నిమజ్జనం(Vinayaka Immersion) సందర్భంగా అనుమతి లేకుండా డీజే ఏర్పాటు(DJ setup) చేయడంపై పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం అందడంతో కానిస్టేబుళ్లు యాదయ్య, రఘు అక్కడికి వెళ్లి డీజే వల్ల చిన్నపిల్లలు, గుండె సంబంధిత సమస్యలున్న వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని నిర్వాహకులకు సూచించారు. అయితే పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ విధులకు ఆటంకం కలిగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కొత్తపేట గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు హన్వాడ ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.

మరిన్ని వార్తలు