ఆలయాల పరిరక్షణకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి
బీజేపీ ఎండోమెంట్ ధార్మిక సెల్ నూతన కార్యవర్గ సమావేశం
ఆసిఫాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో (BJP Party Office)ఎండోమెంట్ (ధార్మిక) సెల్( BJP Endowment (Dharmika)) నూతన కార్యవర్గ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్ పసునూరి తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కన్వీనర్ సూర్య ప్రకాష్,
రాష్ట్ర జాయింట్ కన్వీనర్ మల్లేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు పార్టీ సిద్ధాంతాలు, ఆలయాల పరిరక్షణ, ధార్మిక కార్యక్రమాల విస్తరణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించారు. నూతనంగా నియమితులైన జిల్లా, మండల కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు.
సనాతన ధర్మ పరిరక్షణతోపాటు ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, ధార్మిక సెల్ ప్రతినిధులు, మండల కన్వీనర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.