డ్రగ్స్ తో పట్టుబడ్డ ఎమ్మెల్యే అనుచరుడు?
అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
ఎల్బీనగర్, నవంబర్ 20 : డ్రగ్స్ కేసులో(Drugs case) ఎమ్మెల్యే అనుచరుడు పట్టుపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న అంబర్ పేట పోలీస్ స్టేషన్(Amberpet Police Station) పరిధిలోని డెల్టా కాలేజ్(Delta College) వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హయత్ నగర్ ప్రాంతానికి చెందిన చిట్టబోయిన వేణుగోపాల్ యాదవ్(Chittaboyina Venugopal Yadav) 15 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తో పట్టుపట్టాడు. ఈ కేసులో మొత్తం ముగ్గురిపై అంబర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా, ఈ కేసులో పట్టుబడిన వేణుగోపాల్ యాదవ్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడిగా పేరుంది.
- డ్రగ్స్, గంజాయి ముఠాలను ప్రోత్సహిస్తున్నాడని ఇప్పటికే సుధీర్ రెడ్డిపై ఆరోపణలు?
ఎల్బీనగర్ నియోజకవర్గంలో డ్రగ్స్, గంజాయి ముఠాలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని ఎప్పటినుంచో కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. కాగా, వేణుగోపాల్ యాదవ్ డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కడంతో కాంగ్రెస్ నాయకుల ఆరోపణలకు బలం చేకూరింది. హయత్ నగర్ ప్రాంతానికి చెందిన వేణుగోపాల్ యాదవ్ ముఖ్యంగా మన్సూరాబాద్ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు రఘువీర్ రెడ్డి వర్గంలోని సభ్యుడిగా పేరుంది.
ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకులు ఇప్పటి వరకు స్పందించలేదు. వివిధ పార్టీల నాయకులు రఘువీర్ రెడ్డిపై అనేక ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, యువత జీవితాలతో చెలగాటం ఆడుతూ వారిని డ్రగ్స్, గంజాయిలకు బానిసలు చేసే సంస్కృతిని సుధీర్ రెడ్డిదని ఇప్పటికే రాజకీయ ప్రత్యర్ధుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా అతని అనుచరుడు డ్రగ్స్ తో పట్టు పడడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.