రాణిగంజ్ వెళ్లే వాహనదారులకు అలర్ట్.. 8 నెలల ట్రాఫిక్ ఆంక్షలు

20-11-2026 | 05:39pm

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌(Secunderabad )లోని రాణిగంజ్ జంక్షన్(Ranigunj Junction) మీదుగా ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించనున్నారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు.

పనులు కొనసాగుతున్న సమయంలో కార్లు, ఇతర తేలికపాటి వాహనాలకు ఒకే క్యారేజ్‌వే అందుబాటులో ఉంటుంది. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, గూడ్స్ వాహనాలకు ఈ మార్గంలో అనుమతి ఉండదు. దీంతో రాణిగంజ్, ఎంజీ రోడ్, ట్యాంక్‌బండ్, కర్బలా మైదాన్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంది.

ఈ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు

  • ఎస్‌బీఐ ఎక్స్ రోడ్స్ నుంచి వచ్చే భారీ వాహనాలు రసూల్‌పురా, బేగంపేట్ వైపు వెళ్లాలి.
  • పాట్నీ ఎక్స్ రోడ్స్, క్లాక్ టవర్ నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బీఐ ఎక్స్ రోడ్స్ వైపు మళ్లిస్తారు.
  • ప్యారడైజ్ నుంచి వచ్చే వాహనాలకు సీటీఓ వైపు మళ్లింపు ఉంటుంది.
  • పార్క్ లేన్ నుంచి వచ్చే వాహనాలను పాట్నీ ఎక్స్ రోడ్స్ వైపు పంపిస్తారు.
  • ట్యాంక్‌బండ్ నుంచి రాణిగంజ్ వైపు వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ వైపు మళ్లిస్తారు.
  • ఎగువ ట్యాంక్‌బండ్ నుంచి వచ్చే భారీ వాహనాలను డీబీఆర్ మిల్స్ వద్ద గాంధీనగర్, కవాడిగూడ, ముషీరాబాద్ వైపు పంపిస్తారు.
  • పారడైజ్, మినిస్టర్ రోడ్ నుంచి వచ్చే తేలికపాటి వాహనాలను డిస్టిలరీ రోడ్డు మీదుగా కర్బలా జంక్షన్ వైపు మళ్లిస్తారు.
  • నల్లగుట్ట ఎక్స్ రోడ్ వద్ద వాహనాలను నెక్లెస్ రోడ్ వైపు పంపిస్తారు.

ట్రాఫిక్ అంతరాయాలను తగ్గించేందుకు పాట్నీ, ప్యారడైజ్, పార్క్ లేన్, రసూల్‌పురా, కర్బలా ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు జోయల్ డేవిస్ తెలిపారు. వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు