దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే?
హైదరాబాద్: ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్(Former MLA Danam Nagender) ఎన్నిక వ్యవహారం మరోసారి న్యాయస్థానానికి చేరింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దివంగత నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి(PJR Daughter Vijaya Reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం దానం నాగేందర్‌తో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
ప్రతివాదుల వాదనలు విన్న తర్వాతే ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎన్నిక(Khairatabad MLA Election)కు సంబంధించిన న్యాయపోరాటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తదుపరి విచారణలో ప్రతివాదులు ఏం వివరణ ఇస్తారన్నది ఉత్కంఠగా మారింది.