అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి
ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో
ఎల్బీనగర్, నవంబర్ 20 : ఎల్బీనగర్ జోనల్(LB Nagar Zonal) పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను జోనల్ కమిషనర్ వికాస్ మహాతో ఆదేశించారు. ఎల్బీనగర్ జోనల్ పరిధిలోని లింగోజిగూడ, చంపాపేట, హస్తినాపురం డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులను(development projects) అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
లింగోజిగూడ డివిజన్ లోని కాకతీయ కాలనీ, మైత్రి నగర్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను, చంపాపేట డివిజన్ లోని ఎంఎంఆర్ కాలనీలో జరుగుతున్న బాక్స్ డ్రైన్ పనులను, నందనవనం శ్మశానవాటికలో దహన వేదిక, కూర్చునే ప్రదేశం, మరుగుదొడ్లు, సీసీ రోడ్డు పనులను, హస్తినాపురం డివిజన్ ఇంద్రప్రస్థ కాలనీలో జరుగుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. పనుల నాణ్యతను పాటిస్తూ, నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట డిప్యూటీ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.