'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' ప్రారంభం
దేశంలోనే తొలిసారిగా కుటుంబ జీవిత బీమా పథకం అమలు
మహమ్మదాబాద్,నవంబర్ 20 విజయక్రాంతి: ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా(Financial Security) కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance Scheme) అమలు చేస్తోందని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి(Parigi MLA Dr. T. Rammohan Reddy) అన్నారు. మండల పరిధిలోని దేశాయిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఈ పథకాన్ని ప్రారంభించడం గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా సార్వజనీన కుటుంబ జీవిత బీమా పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు.
కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా విపత్కర పరిస్థితి ఎదురైతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా ఆదుకోవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.కుల,మత, వర్గ,లింగ వివక్ష లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డుల ఆధారంగా కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించడం ద్వారా ప్రజలకు భద్రత, భవిష్యత్తుపై భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దొంగల మణెమ్మ బీమయ్య, ఉపసర్పంచ్ శశిధర్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రామ్‌లాల్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం నారాయణ, ఎంపీడీవో నరేందర్ రెడ్డి, శాంతిరంగ్యా,పిఎసిఎస్ డైరెక్టర్లు కొత్త నారాయణ,హెచ్. ముకుందం,
పోంచని నరసింహ, పంచాయతీ కార్యదర్శి భార్గవి, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.