ఖేలో ఇండియా వేదికలను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి

21-11-2026 | 12:44am

హనుమకొండ, నవంబర్ 20 (విజయక్రాంతి): డిసెంబర్ 18 నుండి 21 వరకూ 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్(Khelo India Youth Games) లో భాగంగా హనుమకొండ(Hanamkonda) జేఎన్ఎస్ లో  అథ్లెటిక్స్(athletics) విభాగంలో పోటీలు నిర్వహిస్తుండగా జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో చేస్తున్న క్రీడలు, క్రీడాకారుల కోసం కల్పిస్తున్న మౌలిక వసతుల ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari) , స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఛైర్మన్ శివసేనారెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత,వరద రాజేశ్వర్ రావు లతో కలిసి పరిశీలించారు.

మరిన్ని వార్తలు