ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా

20-11-2026 | 05:13pm

సిద్దిపేట: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా (Indiramma Family Life Insurance) పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా (Life Insurance) కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం (Premium) చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఆర్థిక భద్రత (Financial Security) కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.అలాగే నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు