ఎస్ఐ అభ్యర్థులకు బిగ్ అప్‌డేట్

20-11-2026 | 07:31pm

తెలంగాణ SI అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి హాల్ టికెట్లు!

హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కీలక అప్‌డేట్ వచ్చింది. 275 సబ్ ఇన్‌స్పెక్టర్ (Sub Inspector) పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్ టికెట్ల(Preliminary Written Exam Hall Tickets) విడుదల తేదీని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(Telangana Police Recruitment Board) ప్రకటించింది. నవంబర్ 22 ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 28 అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ అవకాశం ఉంటుంది.

నవంబర్ 29న ప్రిలిమ్స్ పరీక్ష

ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షను నవంబర్ 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. మొత్తం 275 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 1,60,712 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం 335 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కో పోస్టుకు సుమారు 584 మంది పోటీపడుతున్నారు.

హాల్ టికెట్ డౌన్‌లోడ్ ఇలా..

  1. ముందుగా TGPRB అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  2. SI Preliminary Written Test Hall Ticket లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. రిజిస్ట్రేషన్ వివరాలు, అడిగిన లాగిన్ సమాచారం నమోదు చేయాలి.
  4. స్క్రీన్‌పై కనిపించే హాల్ టికెట్‌లో వ్యక్తిగత వివరాలు, పరీక్షా కేంద్రాన్ని పరిశీలించాలి.
  5. హాల్ టికెట్‌ను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.

అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినవి

పరీక్ష ప్రారంభానికి ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. హాల్ టికెట్‌తో పాటు ఒరిజినల్ ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదు. పరీక్షకు సంబంధించిన పూర్తి నిబంధనలను హాల్ టికెట్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు.

మరిన్ని వార్తలు