ఫ్లిప్‌కార్ట్ సేల్ ఎఫెక్ట్.. వాల్‌మార్ట్‌కు భారీ షాక్
ఫ్లిప్‌కార్ట్ సేల్ టైమింగ్ మార్పు.. వాల్‌మార్ట్ వృద్ధికి బ్రేక్!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నిర్వహించిన Big Billion Days పండుగ సేల్ సమయం మారడం మాతృసంస్థ వాల్‌మార్ట్ త్రైమాసిక ఫలితాలపై ప్రభావం చూపింది. ఈ ఏడాది పండుగ సేల్‌ను గతేడాదితో పోలిస్తే భిన్నమైన సమయంలో నిర్వహించడంతో Walmart మూడో త్రైమాసిక (Q3) ఆదాయ వృద్ధిపై ఒత్తిడి పడింది. ఈ మార్పు కారణంగా తమ Top-line Growthపై 100 Basis Points మేర ప్రతికూల ప్రభావం పడినట్లు వాల్‌మార్ట్ వెల్లడించింది. వాల్‌మార్ట్ విడుదల చేసిన Earnings Statement ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన 11 రోజుల Big Billion Days Sale ఈసారి నాలుగో త్రైమాసికం (Q4)లోకి మారింది. గత ఏడాది సేల్ జరిగిన సమయంతో పోలిస్తే ఈసారి షెడ్యూల్ మారడంతో, ఆ విక్రయాల ద్వారా రావాల్సిన ఆదాయంలో కొంత భాగం మూడో త్రైమాసికం బదులుగా నాలుగో త్రైమాసిక ఫలితాల్లో ప్రతిబింబించనుంది.
Q4లో కనిపించనున్న సేల్ ప్రభావం!
సేల్ టైమింగ్ మార్పు కారణంగా Q3లో వృద్ధి తగ్గినప్పటికీ, ఇదే ప్రభావం నాలుగో త్రైమాసికంలో సానుకూలంగా కనిపించే అవకాశం ఉందని వాల్‌మార్ట్ అంచనా వేసింది. అంటే ఫ్లిప్‌కార్ట్ పండుగ సేల్ ద్వారా వచ్చిన Business Contribution పూర్తిగా తగ్గిపోలేదని, దాని లెక్కలు మరో త్రైమాసికానికి మారాయని కంపెనీ వివరణ ఇచ్చింది. ఈ పరిణామం ఈ-కామర్స్ రంగంలో పండుగ సీజన్ సేల్స్ టైమింగ్‌కు ఎంత ప్రాధాన్యం ఉందో మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా భారత మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల పండుగ విక్రయాలు అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాల Quarterly Resultsపైనా ప్రభావం చూపుతున్నాయి.