ప్రశ్నిస్తే దండించడమా.. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

23-11-2026 | 03:44pm

మాల మహానాడు మండల అధ్యక్షులు మందాల శ్రీనివాస్.

కోనరావుపేట నవంబర్ 23 (విజయక్రాంతి):గ్రామ సభలో(Village Council) బతుకమ్మ, దసరా పండుగల ఖర్చుల లెక్కలు అడిగినందుకు బావుసాయిపేట గ్రామానికి(Bausaipet village) చెందిన మాల బిడ్డ తిక్కల నవీన్‌పై గ్రామ సర్పంచ్ భర్త షేక్ ఫిరోజ్ పాషా దాడి చేశారని మాల మహానాడు మండల అధ్యక్షులు మందాల శ్రీనివాస్ ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.సోమవారం కోనరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మందాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాల మహానాడు జిల్లా,మండల నాయకులు నిరసన తెలిపారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ సభలో సెక్రటరీ, వార్డు సభ్యుల సమక్షంలో లెక్కలు అడిగినందుకు నవీన్‌పై సర్పంచ్ భర్త దాడి చేశారని పేర్కొన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, భవిష్యత్తులో మరెవరూ దాడులకు పాల్పడే ఆలోచన చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై సోమవారం కోనరావుపేట ఎస్సై రామ్మోహన్‌కు ఫిర్యాదు చేసి, బాధ్యుడిని వెంటనే అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాలల ఐక్యవేదిక కన్వీనర్ తుంగ శివరాజ్, కో-కన్వీనర్ జక్కుల యాదగిరి, జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్, వేములవాడ డివిజన్ కన్వీనర్ బత్తుల కమలాకర్, ఐక్యవేదిక జిల్లా నాయకుడు అంగూరి సుధాకర్, ఉపాధ్యక్షుడు మాదాసు భూమయ్య, ప్రధాన కార్యదర్శి కులేరు బాబు, కోశాధికారి కులేరు చంద్రయ్య, కోనరావుపేట సంఘ అధ్యక్షుడు యాస శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు నక్క పరశురాములు, మాదాసు స్వామి, నీరటి కిరణ్, యాస సదానందం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు