వట్టిమల్లలో అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత

13-10-2026 | 07:17pm

500 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ..

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఫాక్స్ చైర్మన్ చేపూరి గంగాధర్

కోనరావుపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం(Konaraopet Mandal)లోని వట్టిమల్ల గ్రామంలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించగా, సుమారు 500 మంది గ్రామస్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి కోనరావుపేట మండల ఫాక్స్ చైర్మన్ చేపూరి గంగాధర్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాల ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.పాడి పంటలు సమృద్ధిగా పండి, రైతన్నలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండ వెంకటేష్, మార్కెట్ డైరెక్టర్ కర్రె శంకర్, దుర్గామాత ఆలయ చైర్మన్ జవ్వాజి తిరుపతి, ఉపసర్పంచ్ గంగారం సంపత్, గ్రామ ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు