అబుదాబి నుంచి శబరిమలకు తెలుగు అయ్యప్ప స్వాముల ఆధ్యాత్మిక యాత్ర
దేశాలు దాటినా.. మరువని తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు!
సుల్తానాబాద్, నవంబర్ 27 విజయక్రాంతి: విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ మన తెలుగు సంస్కృతి(Telugu Culture), సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను మరువకుండా తెలుగు అయ్యప్ప స్వాములు ప్రతి సంవత్సరం అబుదాబి నుంచి శబరిమల పుణ్యక్షేత్రానికి భక్తిశ్రద్ధలతో యాత్ర చేపడుతున్నారు.విదేశీ గడ్డపై ఉంటున్నా స్వామివారి పట్ల తమకున్న భక్తిని, నియమనిష్ఠలను,
గురుస్వాముల మార్గదర్శకత్వంలో పాటించే దీక్షా సంప్రదాయాలను కొనసాగించడం ఎంతో అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇందులో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కుమారుడు శ్రీనివాస్, పలువురు ఉన్నారు.
ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలధారణ చేసి, కఠినమైన నియమాలను పాటిస్తూ, ఇరుముడి ధరించి శబరిమల చేరుకోవడం ద్వారా తమ భక్తిప్రపత్తులను చాటుకుంటున్నారు. ఈ యాత్ర కేవలం ఆధ్యాత్మిక ప్రయాణమే కాకుండా తెలుగు వారి ఐక్యతకు, సంస్కృతి పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తోంది.ఈ బృందంలో గంగారెడ్డి గురుస్వామి, రా
జా శ్రీనివాస్ స్వామి, బిరుదు శ్రీనివాస్ స్వామి, వంశీ స్వామి తదితర అయ్యప్ప స్వాములు పాల్గొంటున్నారు.దేశాలు దాటినా మన సంస్కృతిని మరువకుండా, మన సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేస్తూ, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఈ యాత్రను కొనసాగించడం నిజంగా గర్వించదగిన విషయం...