విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

27-11-2026 | 03:52pm

జనగామ నవంబర్ 27 (విజయక్రాంతి): లింగాల ఘనపూర్ మండలం వనపర్తి గ్రామంలోని పివిఆర్ పాఠశాలలో(PVR School) తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల నిర్వహణ సంఘం(Management Committee) జనగామ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆటలు మరియు క్రీడల వేడుక - 2026 ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తోందని, 2036 ఒలింపిక్స్ ను లక్ష్యంగా చేసుకొని క్రీడలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే డిసెంబర్ 11 నుండి 22 వరకు రాష్ట్రంలో ఖేలో ఇండియా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ప్రతీ పాఠశాలలో క్రీడా మైదానం ఉండాలని, ప్రతీ విద్యార్థి ఏదో ఒక క్రీడలో పాల్గొనాలని, ప్రతీ పాఠశాల నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శైలజ ఉపేందర్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు కొల్లూరి శివ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు సాదం విజయ్ మనోహర్, ప్రతినిధులు, సర్పంచులు, నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు