ఇందిరమ్మ బీమాతో... కుటుంబాలకు ధీమా...

27-11-2026 | 03:42pm

తాడ్వాయి,నవంబర్,27( విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకంతో(Indiramma Life Insurance Scheme) కుటుంబాలకు ధీమా ఏర్పడుతుందని తాడ్వాయి మండల ప్రత్యేక అధికారి రఘునందన్ రావు తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో ఆయన శుక్రవారం ఇందిరమ్మ జీవిత బీమా పథకం కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం ప్రభుత్వం ఈ జీవిత బీమా పథకం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భరత్ కుమార్,సర్పంచ్ సంకు పోచయ్య, ఉప సర్పంచ్ నవీన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బాల సాయిలు,కార్యదర్శి సవిత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు