లక్షల్లో జీతం.. కొబ్బరి వ్యాపారంతో కోట్లు
లక్షల్లో జీతం.. సైడ్ బిజినెస్‌తో రూ.1.17 కోట్లు! చివరకు ఐటీ శాఖ షాక్!
నాగర్‌కోయిల్: కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ లక్షల్లో జీతం తీసుకుంటున్న ఓ మహిళ.. ఆఫీస్ వేళల తర్వాత కొబ్బరి వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించారు. అయితే ఆమె బ్యాంకు ఖాతాలో భారీగా నగదు జమ కావడంతో Income Tax Department దృష్టి పడింది. చివరకు ఈ వ్యవహారం Income Tax Appellate Tribunal (ITAT) వరకు వెళ్లగా.. మహిళకు పాక్షికంగా ఊరట లభించింది. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌కు చెందిన అనిత ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఏడాదికి రూ.25 లక్షల జీతం పొందుతున్నారు. ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయం సంపాదించాలనే ఆలోచనతో కన్యాకుమారి జిల్లాలో కొబ్బరి వ్యాపారం ప్రారంభించారు. రైతుల నుంచి కొబ్బరి తోటలను Leaseకు తీసుకుని కూలీలతో కాయలు కోయించేవారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల రైతుల వద్ద నుంచి తాజా కొబ్బరికాయలను నేరుగా కొనుగోలు చేసి, వాటి పీచు తొలగించి Marketలో విక్రయించేవారు. ఇలా ఉద్యోగం, వ్యాపారం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు.
ఈ క్రమంలో 2020-21 Assessment Yearలో ఆమె బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.1.17 కోట్ల నగదు జమైంది. భారీ Cash Depositsను గుర్తించిన Assessing Officer (AO) ఆమె ఖాతాను Scrutinyకి తీసుకున్నారు. విచారణలో అనిత తన వ్యాపార వివరాలను వెల్లడించారు. మొదట కొబ్బరి విక్రయాల ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా భావించినట్లు చెప్పిన ఆమె.. అనంతరం Updated ITR దాఖలు చేసి, Income Tax Actలోని Section 44AD కింద Presumptive Taxation విధానంలో వ్యాపార ఆదాయాన్ని చూపించారు. రూ.1.277 కోట్ల Turnoverపై 8 శాతం చొప్పున రూ.10.216 లక్షల ఆదాయాన్ని ప్రకటించారు. అయితే వ్యాపారానికి సంబంధించిన Account Books, Bills, Purchase Records అందుబాటులో లేకపోవడంతో ఆదాయపు పన్ను అధికారి ఆమె వాదనను పూర్తిగా అంగీకరించలేదు. బ్యాంకులో జమ చేసిన రూ.1.17 కోట్ల మొత్తాన్ని Unexplained Incomeగా పరిగణించి పన్ను విధించారు. దీంతో అనిత చార్టర్డ్ అకౌంటెంట్ కె. విశ్వ పద్మనాభన్ సహాయంతో చెన్నైలోని Income Tax Appellate Tribunalను ఆశ్రయించారు.
విచారణ సందర్భంగా బ్యాంకు Overdraft Accountలో జరిగిన లావాదేవీలు వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా ఉన్నాయని ట్రిబ్యునల్ గుర్తించింది. రైతులు, సరఫరాదారులు ఇచ్చిన Certificates కూడా కొబ్బరి వ్యాపారం వాస్తవమేనని నిరూపించేందుకు ఉపయోగపడ్డాయి. ఇప్పటికే ITR-U ద్వారా Turnoverను వెల్లడించిన నేపథ్యంలో, ఆ వివరాలను పరిగణనలోకి తీసుకోకుండా మొత్తం నగదుపై పన్ను విధించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. అయితే కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన పూర్తి రికార్డులు లేకపోవడంతో అనితకు పూర్తిస్థాయి మినహాయింపు లభించలేదు. రూ.1.177 కోట్ల మొత్తంలో 8 శాతం అంటే రూ.9.416 లక్షలను అదనపు వ్యాపార ఆదాయంగా పరిగణించి పన్ను లెక్కించాలని Assessing Officerను ITAT ఆదేశించింది. దీంతో రూ.1.17 కోట్ల మొత్తాన్ని పూర్తిగా లెక్కల్లో చూపని ఆదాయంగా పరిగణించిన నిర్ణయంపై ఆమెకు పాక్షిక ఉపశమనం లభించింది. ఉద్యోగంతో పాటు చిన్న వ్యాపారం నిర్వహించిన మహిళకు ఎదురైన ఈ Income Tax వివాదం.. వ్యాపార లావాదేవీలకు సరైన Bills, Records, Documentation ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేస్తోంది.