నిరాశలో జనగామ వాసులు

27-11-2026 | 12:12pm

మెడికల్ కాలేజీ ప్రారంభం మళ్లీ వాయిదా

జనగామ, నవంబర్ 27 (విజయక్రాంతి):  జనగామ జిల్లా కేంద్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మెడికల్ కాలేజీ(Jangaon Medical College Inauguration Postponed) ప్రారంభోత్సవం రెండోసారి వాయిదా పడటంతో జిల్లా వాసుల్లో నిరాశ నెలకొంది. శుక్రవారం ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమం మంత్రి దామోదర రాజనర్సింహ కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోవడంతో 28వ తేదీకి వాయిదా పడినట్లు అధికారులు ప్రకటించారు.ఇది ఇలా రెండోసారి వాయిదా పడటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెడికల్ కాలేజీ(Jangaon Medical College) ప్రారంభం మళ్లీ మళ్లీ వాయిదా పడటం సరికాదని, ఇకనైనా నిర్ణీత తేదీకి ప్రారంభించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ కాలేజీ ప్రారంభమైతే జిల్లాకు మెరుగైన వైద్య సేవలు, వైద్య విద్య అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, వాయిదాలతో ఆ ప్రయోజనాలు ఆలస్యం అవుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 28వ తేదీన అయినా ప్రారంభోత్సవం ఖచ్చితంగా జరగాలని, మరోసారి వాయిదా పడకుండా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు