పేద కుటుంబాలకు అండగా ఇందిరమ్మ భీమా పథకం...
తాడ్వాయి,నవంబర్,27( విజయ క్రాంతి): పేద కుటుంబాలకు అండగా ఇందిరమ్మ జీవిత బీమా పథకం(Indiramma Life Insurance Scheme) నిలుస్తుందని బ్రహ్మాజీ వాడి గ్రామ సర్పంచ్ అంజనీభాయి రఘుపతిరావు తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీ వాడి గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సర్పంచ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.... కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోయినప్పుడు ఈ పథకం అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబానికి రూ.5 అందించబడతాయన్నారు.ఈ పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రాజు యాదవ్,కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రవీందర్ రావు, నాయకులు అశోక్ రావు,అంజయ్య,గడ్డం రాజు,రాజేందర్ రావు, రమేష్ రావు తదితరులు పాల్గొన్నారు.