GHMC జోనల్ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం

27-11-2026 | 08:43am

జీహెచ్‌ఎంసీ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు.. పరుగులు పెట్టిన సిబ్బంది!

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. జీహెచ్‌ఎంసీ (GHMC) జోనల్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న Fire Department సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు Fire Engines రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు కార్యాలయంలోని ఇతర విభాగాలకు, సమీప భవనాలకు వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మరోవైపు స్థానిక పోలీసులు కూడా అక్కడికి చేరుకుని Rescue Operationsను పర్యవేక్షిస్తున్నారు.

ఖైరతాబాద్ ప్రధాన రహదారికి సమీపంలోనే కార్యాలయం ఉండటంతో Traffic Diversion చేపట్టారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ ప్రమాదానికి Short Circuit కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే కార్యాలయంలోని ఫైళ్లు, కంప్యూటర్లు, ఫర్నిచర్‌కు జరిగిన నష్టం ఎంత అనేది స్పష్టత రానుంది. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు