TVS కుటుంబంలో ఆస్తుల చిచ్చు

27-11-2026 | 01:15pm

వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో వారసత్వ పోరు.. హైకోర్టును ఆశ్రయించిన లక్ష్మీ వేణు!

న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ వ్యాపార కుటుంబాల్లో ఒకటైన TVS గ్రూప్‌లో ఆస్తుల పంపకాల వివాదం తెరపైకి వచ్చింది. TVS Motor Company ఛైర్మన్ ఎమెరిటస్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీ వేణు.. కుటుంబానికి చెందిన ఉమ్మడి ఆస్తుల్లో తనకు చట్ట ప్రకారం రావాల్సిన వాటాను కేటాయించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామంతో ప్రముఖ Business Familiesలో వారసత్వ హక్కులు, కుమార్తెలకు ఆస్తిలో సమాన వాటా అనే అంశాలు మరోసారి చర్చకు వచ్చాయి.

ఈ వివాదానికి ప్రధాన కారణం 2024లో కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన Agreementగా తెలుస్తోంది. ఆ ఒప్పందంలో వ్యాపార బాధ్యతలను మాత్రమే విభజించారని, కుటుంబ ఆస్తుల్లో తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వలేదని లక్ష్మీ వేణు, ఆమె తల్లి మల్లికా శ్రీనివాసన్ తమ Petitionలో పేర్కొన్నారు. మరోవైపు, తన ఇద్దరు పిల్లలకు న్యాయం జరిగే విధంగానే ఆస్తుల విభజన చేపట్టినట్లు వేణు శ్రీనివాసన్ వాదిస్తున్నారని సమాచారం. TVS Holdings, TVS Motor Company, TVS Credit Services, Sundaram-Clayton వంటి సంస్థల్లోని వాటాలు వివిధ Holding Entities, 'VS Trust' ద్వారా నిర్వహించబడుతున్నాయి. దీంతో ఈ వివాదం కేవలం కుటుంబ ఆస్తుల పంపకాలకే పరిమితం కాకుండా, కంపెనీల్లో వాటాల Ownership, Trustల చట్టపరమైన హక్కులు వంటి కీలక అంశాల చుట్టూ తిరుగుతోంది.

తన వాదనకు లక్ష్మీ వేణు Hindu Succession Act, 1956లోని 2005 Amendmentను ఆధారంగా చూపిస్తున్నారు. ఈ సవరణ ప్రకారం హిందూ మితాక్షర ఉమ్మడి కుటుంబంలో కుమార్తెలకు కూడా కుమారులతో సమానంగా పిత్రార్జిత ఆస్తిపై జన్మతః హక్కులు ఉంటాయి. వారిని Co-parcenersగా పరిగణిస్తారు. ఆస్తి విభజన కోరే హక్కు కూడా ఉంటుంది. ఈ హక్కుల అమలుపై తండ్రి 2005 సవరణ అమల్లోకి వచ్చిన సమయంలో జీవించి ఉన్నారా లేదా అనే అంశం నిర్ణయాత్మకం కాదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. అయితే, ఈ కేసులో అసలు కీలకమైన అంశం ఆస్తుల స్వభావం. Ancestral Property అంటే పిత్రార్జిత ఆస్తి, Self-acquired Property అంటే వ్యక్తి స్వయంగా సంపాదించిన ఆస్తి. ఈ రెండింటికీ చట్టపరంగా వేర్వేరు నిబంధనలు వర్తిస్తాయి. పిత్రార్జిత ఆస్తిలో చట్టబద్ధమైన వారసులకు హక్కులు ఉండగా, స్వార్జిత ఆస్తిని యజమాని తన ఇష్టానుసారం వీలునామా ద్వారా ఇతరులకు కేటాయించే అవకాశం ఉంటుంది. మరోవైపు, TVS గ్రూప్ ఆస్తుల్లో చాలా భాగం Family Trusts పరిధిలో ఉండటం ఈ కేసును మరింత సంక్లిష్టంగా మార్చే అంశం. Trust కింద ఉన్న ఆస్తుల Legal Ownership, వాటి ద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలు, కంపెనీల్లో నిర్వహణ నియంత్రణ.. ఇవన్నీ వేర్వేరు అంశాలు. అందువల్ల సాధారణ Partition Suit తరహాలో ఈ వివాదాన్ని పరిష్కరించడం అంత సులభం కాకపోవచ్చని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

2024లో కుదిరిన కుటుంబ ఒప్పందం కూడా ఈ కేసులో కీలకంగా మారనుంది. ఒకసారి కుటుంబ సభ్యుల మధ్య Agreement కుదిరితే దాని నిబంధనలు సాధారణంగా సంబంధిత వ్యక్తులకు వర్తిస్తాయి. అయితే మోసం, బలవంతం వంటి కారణాలు ఉన్నాయని భావిస్తే చట్టపరంగా దానిని సవాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ఒప్పందం చెల్లుబాటు, లక్ష్మీ వేణు ఆర్థిక హక్కులు ఇప్పటికే పరిష్కారమయ్యాయా లేదా అనే అంశాలను మద్రాస్ హైకోర్టు పరిశీలించాల్సి ఉంది. ఈ కేసు తీర్పు కేవలం TVS కుటుంబానికే కాకుండా, పెద్ద వ్యాపార సంస్థలు, Family Trusts, వారసత్వ ఆస్తుల విభజనకు సంబంధించిన భవిష్యత్ వివాదాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా కుమార్తెలకు పిత్రార్జిత ఆస్తిలో సమాన హక్కులు, కుటుంబ ఒప్పందాల చట్టబద్ధత, ట్రస్టుల పరిధిలోని ఆస్తులపై హక్కులు వంటి అంశాలపై ఈ కేసు ఆసక్తిని పెంచుతోంది.

మరిన్ని వార్తలు