పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ అందజేత
27-11-2026 | 04:02pm
రిటైర్డ్ విద్యాశాఖ అధికారి డాక్టర్ ప్రభు దయాల్
చుంచుపల్లి,నవంబర్ 27 (విజయక్రాంతి ): సకల పోటీ పరీక్షల(All competitive exams) సిద్ధపాటుకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్ సుమారు 100 యోజన మరియు ఇతర స్టడీ మెటీరియల్ను పూర్వ కొత్తగూడెం ఎంఈఓ డాక్టర్ ప్రభు దయాల్ నేడు కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన గ్రంథాలయ లైబ్రేరియన్ లలిత కుమారి మరియు కార్యదర్శి కరుణకుమారి లకు అందజేశారు. పోటీ పరీక్ష ల సిద్ధపాటులో ఈ స్టడీ మెటీరియల్ ఉపయోగించుకోవాలని కోరారు. భవిష్యత్తులో మరింత స్టడీ మెటీరియల్ను సమకూర్చి అందించనున్నట్లు తెలిపారు.