విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

12-09-2026 | 08:15pm

ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య

సుల్తానాబాద్‌,(విజయ క్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సుల్తానాబాద్‌ మండల ఎంఈఓ రాజయ్య(Mandal MEO Rajaiah), పెద్దపల్లి జిల్లా(Peddapalli District) ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్‌ అన్నారు. సుల్తానాబాద్‌లోని ఎస్‌ఎన్‌ఆర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ(SNR Sports Academy)లో శనివారం పెద్దపల్లి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు(District Level SGF Table Tennis Competitions) నిర్వహించారు. పోటీలను ఎంఈఓ రాజయ్య, జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్‌, పీఈటీ కార్యదర్శి దాసరి రమేష్‌, సుల్తానాబాద్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్‌, ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెంపొందుతాయని పేర్కొన్నారు. పోటీల అనంతరం విజేతలకు పెద్దపల్లి జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోడం అజయ్‌ బహుమతులు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్‌ మండల ఎస్‌జీఎఫ్‌ కన్వీనర్‌ తాండ్ర ప్రణయ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు ఆసియా, సరస్వతి, ఎస్‌ఎన్‌ఆర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ కోచ్‌ సత్యనారాయణ, విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు