మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన మాజీ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్
13-09-2026 | 12:03am
మల్కాజిగిరి,(విజయక్రాంతి): ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ విజయ్ నగర్ కాలనీలో శనివారం జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో అందజేసిన మట్టి వినాయక విగ్రహాలను(clay ganesha idols) మాజీ కార్పొరే టర్ ప్రేమ్ కుమార్(Former corporator prem kumar) పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ(Environmental protection) ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా ముఖ్యంగా చెరువులని కాలుష్యం కాకుండా, జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో మట్టి వినాయకులను అందిస్తోందని ఆయన తెలిపారు. వినాయక చవితి సందర్భంగా జీహెచ్ ఎంసీ, విద్యుత్, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.