ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు.. 22Aపై చర్చ

12-09-2026 | 09:11am

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly) ఆరో రోజు కొనసాగనున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్(Gaddam Prasad Kumar) శాసనసభ సమావేశాలు ప్రారంభించనున్నారు. నేడు శాసనసభలో రెండు బిల్లులు, రెండు స్వల్పకాలిక చర్చలు జరగనున్నాయి. తెలంగాణ ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ బిల్లు పరిశీలించనున్నారు. మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) బిల్లుకు ఆమోదం తెలపాలని ప్రతిపాదించనున్నారు. 

కోర్ అర్బన్ రీజియన్ సమగ్ర పరిపాలన బిల్లును(Core Urban Region Comprehensive Administration Bill) ఆమోదింప చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సభలో ప్రతిపాదించనున్నారు. అసెంబ్లీలో 22ఏ నిషేధిత జాబితాపై స్పల్పకాలిక చర్చ జరగనుంది. రిజిస్ట్రేషన్ చట్టం సెక్టార్ 22ఏకు(22A) సంబంధించిన సమస్యలు, ఎల్ నినో ప్రభావాలు- నివారణ చర్యలు అనే అంశంపై సభలో చర్చించనున్నారు. సభ నుంచి సస్పెండ్ నేపథ్యంలో బీఆర్ఎస్ నిరసన(BRS Protest) కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వెలుపల భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు