రామంతాపూర్ పాలిటెక్నిక్‌ వద్ద ఉద్రిక్తత.. బీజేవైఎం నేతల అరెస్ట్!

11-09-2026 | 03:46pm

ఉప్పల్‌ సెప్టెంబర్11విజయక్రాంతి: జీవో 97ను రద్దు చేయాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్‌(Government Polytechnic) కళాశాలలను శక్తి పరిధిలోకి తీసుకురావద్దని డిమాండ్‌ చేస్తూ రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థుల నిరసనకు కళాశాల సిబ్బంది సైతం మద్దతు ప్రకటించారు. ప్రిన్సిపాల్‌ నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల వరకు సిబ్బంది ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్య అభ్యసిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థులపై జీవో 97 ప్రభావం చూపే అవకాశం ఉందని అధ్యాపకులు, ఉద్యోగులు ఆందోళన(Employees concerned) వ్యక్తం చేశారు. ‘యంగ్‌ ఇండియా స్కిల్‌ డెవలప్‌మెంట్‌’ పేరుతో పాలిటెక్నిక్‌ కళాశాలలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.   మద్దతుగా బీజేవైఎం 

జీవో 97 ను వెంటనే రద్దు చేయాలని  విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా బీజేవైఎం నేతలు కళాశాల వద్ద నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. కొందరు బీజేవైఎం శ్రేణులు కళాశాల గేటు గోడకి లోపటికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత  ఉద్రిక్తత మారింది పోలీసులు,  బీజేవైఎం మధ్య తోపులాట జరిగింది దీంతో పోలీసులు నాయకులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో కళాశాల పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఉద్యమాన్ని అన్చివేసేలా చూస్తుందని బిజెపి  నాయకులు గణేష్ ఆరోపించారు. అరెస్టులకు భయపడలేదని పాలిటెక్ని విద్యార్థులు డిమాండ్ నెరవేరేవరకు బీజేవైఎం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జీవో 97పై ప్రభుత్వం పునరాలోచించి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో 97ను, శక్తి పరిధిలోకి పాలిటెక్నిక్‌ కళాశాలలను తీసుకువచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. కాగా, కళాశాల ఆవరణలో విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉప్పల్‌ జోన్‌ డీసీపీ సురేష్‌కుమార్‌, ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

మరిన్ని వార్తలు