ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం: మంత్రి వాకిటి
హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల సమావేశాలు(Telangana Monsoon Session) ఆరో రోజు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం నిర్మిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. శాసన మండలిలో క్రీడా విధానంపై మంత్రి వాకిటి ప్రసంగించారు. తెలంగాణలో క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మహిళా క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రతి జిల్లాకు రూ. 2.5 లక్షలు విడుదల చేశామని వెల్లడించారు.
తెలంగాణ బడ్జెట్(Telangana Budget)లో కేటాయింపులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. క్రీడా విధానంలో(Sports Policy) మౌలిక సౌకర్యాలు, నైపుణ్యాలు పెంచతామని పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియాన్ని రూ. 700 కోట్లతో తీర్చిదిద్దుతామని వివరించారు.క్రీడా స్పృహ కలిగే సమాజాన్ని నిర్మించే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్(Young India Physical Education), స్పోర్ట్స్ వర్సిటీ స్థాపించామన్నారు. క్రీడాకారులకు చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. సీఎం కప్ లో 3.36 లక్షల మంది, సీఎం కప్ రెండో ఎడిషన్ లో 5 లక్షలకు పైగా మందిని గుర్తించామని స్పష్టం చేశారు.