1980s రెట్రో ట్రెండ్‌పై పోలీసుల వార్నింగ్
1980ల నాటి ఫోటో కావాలా? నకిలీ యాప్‌ల పట్ల జాగ్రత్త!
హైదరాబాద్: సోషల్ మీడియా యూజర్లు(Social media users), కొత్త కొత్తగా వచ్చే ఫొటో యాప్స్, ఫోటోస్ ఎడిట్ చేసుకునే వారిని సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber police warning) వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఎక్కడ చూసిన 1980s ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. వాట్సాప్ డీప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లో అవే కనిపిస్తున్నాయి. 1980s రెట్రో ఫొటో ట్రెండ్ యూజర్లను సైబర్ క్రైమ్ పోలీసుల అప్రమత్తం చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు షేర్ చేయొద్దని సూచించారు. ట్రెండింగ్ పేరుతో వచ్చే APK ఫైల్స్ డౌన్‌లోడ్(Download APK files) చేయొద్దని సూచించారు. తెలియని యాప్‌లతో ఫోన్‌లోని ఫొటోలు, డేటా దుర్వినియోగమయ్యే అవకాశముందని వివరించారు. ఫొటోలు అప్‌లోడ్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు AIతో ఫొటోలను మార్ఫింగ్ చేసి నకిలీ ఫొటోలు, వీడియోలు సృష్టించే ప్రమాదన్నారు. ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడే అవకాశముందని జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు పేర్కొన్నారు,