వినాయక చవితి ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
డీజేలకు అనుమతి లేదు.. నిబంధనలు పాటించాలి
గణపురం సిఐ కరుణాకర్‌రావు,
మండపాల నిర్వహణదారులకు పోలీసుల సూచనలు
గణపురం,(విజయ క్రాంతి): వినాయక చవితి ఉత్సవాల్లో(Vinayaka Chavithi celebrations) భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డీజేలకు అనుమతి లేదని నిబంధనలు పాటించాలని గణపురం సిఐ కరుణాకర్‌రావు(Ganapuram CI Karunakar Rao) అన్నారు. గణపురం మండల(Ganapuram Mandal) పరిధిలోని వినాయక మండపాల నిర్వహణదారులతో పోలీసులు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కరుణాకర్‌రావు, ఎస్ఐ బి. అశోక్ మాట్లాడుతూ తొమ్మిది రోజుల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లు, విద్యుత్ ప్రమాదాల నివారణ, అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తతతో పాటు భక్తుల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, పోలీసుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని మండపాల నిర్వహణ దారులకు విజ్ఞప్తి చేశారు.