కాలం చెల్లిన చట్టాలు రద్దు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) ఆరో రోజు ప్రారంభమై కొనసాగుతున్నాయి. కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్(Core Urban Region Integrated Governance) బిల్లును మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు. పాలన మరింత బలోపేతానికి ప్రజావిశ్వాసం నిబంధనలకే చట్టం తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర చట్టాల్లోని చిన్న, సాంకేతిక ఉల్లంఘనలను నేరపూరిత పరిధి నుంచి తొలగించడం ఉద్దేశమన్నారు. తద్వారా వ్యాపార సౌలభ్య, సులభతర వాణిజ్యం ప్రోత్సాహమే ప్రజా పాలన లక్ష్యమని మంత్రి వెల్లడించారు.
జన విశ్వాస చట్ట ద్వారా 180కి పైగా చిన్న నేరాలను నేరపూరిత పరిధి నుంచి తొలగిస్తామన్న మంత్రి చట్టం ద్వారా వ్యాపార నిర్వహణ మరింత సులభతరం అవుతోందని చెప్పారు. 400కు పైగా నేరపూరిత నిబంధనలను గుర్తించామని తెలిపారు. చిన్న నేరాలకు జైలుకు బదులు ద్రవ్య జరిమానాలు వేస్తామన్నారు. కాలం చెల్లిన, అనవసరమైన చట్టాలను రద్దు చేస్తామని వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(Ease of Doing Business)ను ప్రోత్సాహిస్తామన్నారు.
చాలా కేసుల్లో చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. కేంద్ర చట్టం(Central Act) అందరికీ ఉపయోగపడాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. చట్ట నిబంధనలపై అందరికీ అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. వ్యాపార రుణాలకు సంబంధించి బ్యాంకర్లు ఇబ్బందులు పడుతున్నారని శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) సూచించారు. వివిధ చట్టాలకు సంబంధించి చట్ట సవరణ చేస్తూ సౌలభ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాలకు సంబంధించి కలెక్టర్లు, వ్యాపారులకు అవగాహన కల్పిస్తామన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిబంధనల సవరణ చట్టం ఆమోదించాలని మంత్రి శ్రీధర్ బాబు సభ్యులను కోరారు. వ్యాపార