చందూర్ ప్రాంత వరదాయని ఎత్తిపోతల పథకం: ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ,(విజయక్రాంతి): చందూర్ ఎత్తిపోతల పథకం(Chandur Lift Irrigation Scheme) ప్రాంత రైతులకు వరదాయిని గా మారిందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచవరం శ్రీనివాస్ రెడ్డి(MLA Pochavaram Srinivas Reddy) అన్నారు. నిజామాబాద్ జిల్లా(Nizamabad District) బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండల కేంద్రంలో చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను ఎమ్మెల్యే పోచారం జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్(Chairman of the State Agros) కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయకట్టు పరిధిలోని పొలాలకు సాగునీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... రైతులకు ఎత్తిపోతల పథకం ద్వారా పంటలకు సాగునీటి కొరత లేకుండా సరఫరా అవుతుందని ఆయన తెలిపారు. రైతులు పుష్కలంగా రెండు పంటలు పండించుకోవచ్చని డోకా లేదన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను ప్రారంభించి సాగునీటిని విడుదల చేయడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమైంది.అనంతరం నిర్వహించిన సమావేశంలో చందూర్ మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నాయకులు సూచించారు.కాగా, కార్యక్రమానికి ముందుగా చందూర్ బస్టాండ్ వద్ద బాన్సువాడ–నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.