నాణ్యమైన విద్యుత్ కోసం రైతుల ధర్నా

12-09-2026 | 09:39am

నంగునూరు, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): నంగునూరు మండల పరిధిలోని కొండంరాజుపల్లి విద్యుత్ సబ్ స్టేషన్(Kondamrajupalli Electrical Substation) వద్ద శనివారం రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ ధర్నాలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు(BRS leaders) పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.వ్యవసాయానికి కోతలు లేకుండా నిరంతరం కరెంట్ ఇవ్వాలని,లేకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు