తెలంగాణలో భారీ వర్షాలు
హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం(Impact of low pressure) కొనసాగుతోంది. దీంతో తెలంగాణలోని(Telangana Heavy Rains) పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) ప్రకటించింది. ఉత్తర, తూర్పు, ఈశాన్య జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. 30-40 కిలో మీటర్ల వేగంగతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉరుములతో కూడిన వర్ష హెచ్చరిక జారీ
చంద్రాపూర్ నుండి బలమైన ఉరుములతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి. మధ్యాహ్నం 3-5 గంటలకు - ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సాయంత్రం 5-6 గంటలకు - నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి భూపాలపల్లిలో జోరుగా వాన పడుతుందని అధికారులు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, యాదాద్రి - భువనగిరి, వికారాబాద్, నారాయణపేట అంతటా సాయంత్రం 5.30 గంటల వరకు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.