రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

12-09-2026 | 11:31pm

కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలి

బెజ్జంకిలో జిల్లా కలెక్టర్  హైమావతి ఆకస్మిక పర్యటన

బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్(District Collector) ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్, ఓపి రిజిస్టర్ తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు సమయ వేళలు పాటిస్తున్నారా అని ఆరా తీశారు. 24/7 ఆసుపత్రి కావున రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బంది ఆదేశించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి మలేరియా, డెంగ్యూ కేసులు వివరాలను ఏఎన్ఎం, సూపర్ వైజర్లతో ఆరా తీశారు.

ప్రతివారం నిర్వహించే శానిటేషన్ డ్రైవ్(Sanitation drive)లో తప్పనిసరిగా పాల్గొని ప్రజలకు సీజనల్ వ్యాధులకు గురికాకుండా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే మండలం కేంద్రం లోని తెలంగాణ మోడల్ స్కూల్(Telangana Model School)- బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, ప్రతి వంటకం విద్యార్థులకు సరిపోయే విధంగా రుచికరంగా వండి విద్యార్థులకు పెట్టే విధంగా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. స్టాక్ రిజిస్టర్, ఇతర రిజిస్టర్లు తనిఖీ చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. వసతి గృహంలో విద్యార్థుల హాజరు ప్రకారమే ప్రతిదీ రాయాలని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.  రిజిస్టర్ మైంటైన్ చేయడంలో పలు సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు