అసెంబ్లీ దగ్గర దాడిపై ఢిల్లీలో ఫిర్యాదు

11-09-2026 | 03:26pm

న్యూఢిల్లీ: ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission) సభ్యురాలు విజయభారతి, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ లతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు వేర్వేరుగా భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) వద్ద పోలీసులు తమపై జరిపిన దాడి తీరును మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా వారికి వివరించారు. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల(BRS women MLAs) పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తూ అవమానించారని, అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, శాసనసభ్యులుగా తమ హక్కులకు విఘాతం కలిగించేలా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వ్యవహరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, స్పీకర్ పై ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు