విజయవంతం చేయాలి

06-11-2026 | 09:47pm

నేరడిగొండ మండల కేంద్రంలోని నివాసంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

నవంబర్ 06, నేరడిగొండ (విజయక్రాంతి): ఈనెల 11న నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలో నిర్వహించే యువ గర్జన సభను విజయవంతం చేయాలని  ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండల(Neradigonda Mandal) కేంద్రంలోని నివాసంలో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామం నుంచి భారాస కార్యకర్తలతో పాటు నిరుద్యోగులు యువ గర్జన సభకు అధిక సంఖ్యలో తరలివచ్చేలా చూడాలని నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు సజన్, భీంరెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు