జిల్లా అధికారికి సన్మానం
25-09-2026 | 05:39pm
ఖానాపూర్ (విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లాలో(Nirmal District) జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిగా(District Tribal Welfare Development Officer) బాధ్యతలను స్వీకరించిన నిహారిక(Niharika) ను గిరిజన ఆశ్రమ పాఠశాల(Tribal Ashram School) ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు శుక్రవారం సన్మానం చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించబడి విద్యా ప్రమాణాల చర్చించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికారి నిహారికను ఆశ్రమ గిరిజన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అనూష, ఉద్యోగులు బు ఖ్య రమేష్ రాథోడ్ శివాజీ తదితరులు ఉన్నారు