కాంగ్రెస్ పాలనలోనే మహిళల పురోభివృద్ధి :మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
మానకొండూర్, మార్చి19(విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలోనే మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కప్పంపల్లి సత్య నారాయణ అన్నారు. గురువారం తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో వీవో భవన నిర్మాణ పనులకు ఆయన భూ మి పూజ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడు తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చే యాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో పాటు ఉన్నదని ఆయన చెప్పారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభు త్వం లక్ష్యమని అందుకు అనుగుణంగానే ఎ లాంటి వడ్డీ లేని రుణాలు బ్యాంకులద్వారా మహిళా సంఘాలకు అందిస్తున్నదన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమా న్ని ఏమాత్రం పట్టించుకోలేదని, మహిళా సంఘాల పటిష్టతకు పాటుపడలేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమే ష్ మాజీ అధ్యక్షుడు రమణారెడ్డి, గ్రామ సర్పంచ్ తాట్ల తిరుపతి, ఉప సర్పంచ్ మహే ష్, పార్టీ నాయకులు జె. లింగయ్య, జె రవి, రమేష్ పాశం రాజిరెడ్డి సతీష్ రెడ్డి రవికుమార్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణ కాలనీలో...
తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో నూతనంగా నిర్మించ తలపెట్టిన వివో భవనం పనులకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురువా రం భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జి శ్వేత, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేష్, మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, దావు సంపత్ రెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, బుదారపు శ్రీనివాస్, మాచర్ల అంజయ్య, గోగూరి నరసింహారెడ్డి అజయ్, మాచర్ల శీను, అలవాల బాబు, సంపత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నేదునూరులో...
నేదునూరు గ్రామంలో వీవో భవన నిర్మాణం పనులకు మానకొండూరు ఎమ్మె ల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కనకం లక్ష్మీ కొమరయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారు రమేష్, పార్టీ నాయకులు రెడ్డి గాని రాజు, ఉప్పులేటి రాజు మామిడి అనిల్ కుమార్, గోగూరి నరసింహారెడ్డి పాల్గొన్నారు.




